News April 22, 2025
కడప జిల్లాలో ఎస్ఐల బదిలీ

కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిపాదనల మేరకు 10 మందికి స్థానచలనం కల్పించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 10, 2026
కడప: డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఇదే చివరి అవకాశం

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు పెండింగ్ సబ్జెక్టులను ఒకేసారి రాసుకునే అవకాశాన్ని కల్పించినట్లు సీఈ ప్రొ. కె.ఎస్.వి. కృష్ణారావు తెలిపారు. 2010 నుంచి 2019 సంవత్సరాలలో డిగ్రీ చదివి పాస్ కాని వారికి ఇదే చివరి అవకాశమన్నారు. మార్చి 16వ తేదీ లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు YVU అధికార వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
News February 10, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు:
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.15,950
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,674
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,670.
News February 10, 2026
రేపే అసెంబ్లీ: ఆకేపాటి, సుధ ఎంట్రీ ఇస్తారా..?

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా YCP MLAలు ఆకేపాటి అమరనాథరెడ్డి, దాసరి సుధ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సమావేశాలకు దూరంగా ఉన్న వీరు కీలకమైన బడ్జెట్ సమావేశాల్లోనైనా అడుగుపెడతారా అన్న అంశంపై ఆయా నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సభలో పాల్గొని సమస్యలపై గళమెత్తి నిధులు రాబట్టాలని స్థానికులు కోరుతున్నారు.


