News March 28, 2025

కడప జిల్లాలో తగ్గిన అరటికాయల ధరలు.!

image

కడప జిల్లాలో అరటి ధరలు అమాంతంగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టన్ను రూ.6వేల నుంచి రూ.9వేలు పలుకుతున్నాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు అరటి గెలలన్నీ నేలకూలడంతో నష్టపోయిన రైతులను తగ్గిన అరటి ధరలు మరింత కుంగదీస్తున్నాయి. గతంలో టన్ను అరటికాయలు రూ.16 నుంచి రూ.18వేలు పలికాయి. ప్రభుత్వం స్పందించి అరటికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. = రైతులను = అరటికాయలు రూ.16 వేల

Similar News

News April 1, 2025

కడపలో హిజ్రాల ఆందోళన

image

పదేళ్లుగా హిజ్రాతో సహజీవనం చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హిజ్రాలు కోరారు. ఈ మేరకు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు 50మందికి పైగా హిజ్రాలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సీఐ రామకృష్ణ జోక్యం చేసుకుని విచారించి న్యాయం చేస్తామన్నారు. ఆయన హామీతో హిజ్రాలు ఆందోళన విరమించారు.

News April 1, 2025

బ్రహ్మంగారిమఠంలో ఇరువర్గాల దాడి

image

బ్రహ్మంగారిమఠం గ్రామంలో సోమవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. భూతగాదాతో ఘర్షణ జరిగింది. మల్లికార్జున్ రెడ్డి, జయరాం రెడ్డి, అతని తండ్రిపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యుల పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News April 1, 2025

కడప జిల్లాలో కరవు మండలాలు ఇవే..!

image

రాష్ట్ర వ్యాప్తంగా కరవు మండలాలను గుర్తిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం కడప జిల్లాలో 10 మండలాల్లో కరవు ఉందని తేలింది. దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, అవధూత కాశీనాయన, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైలవరం, తొండూరు, మైదుకూరును కరవు మండలాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు ఉత్తర్వులు రాగా.. ఆయా మండలాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. 

error: Content is protected !!