News December 16, 2025

కడప జిల్లాలో దుమారం రేపిన CIల బదిలీలు.!

image

కడప జిల్లాలో CIల బదిలీలపై కూటమి ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ముందు తమను సంప్రదించకుండా సీఐల బదిలీలు చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే ప్రొద్దుటూరు, ముద్దనూరు, కమలాపురానికి కొత్త సీఐలను నియమించారని దీనిపై ప్రొద్దుటూరు MLA వరద మండిపడుతున్నారు. CMOకు ఫిర్యాదు చేయడానికి ఆయన అమరావతికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Similar News

News December 18, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారు- వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారు, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.13230.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.13172.00
*వెండి 10 గ్రాముల ధర: రూ.1990.00

News December 18, 2025

కడప జిల్లాలో అస్థి పన్ను డిమాండ్ ఎన్ని కోట్లంటే..

image

కడప జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.162.81 కోట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు రూ.64.78 కోట్లు (64.78%) మాత్రమే వసూలైంది. రూ. కోట్లల్లో KDP-100.80 గాను 37.65, PDTR-35.33గాను 13.17, PVLD-8.65 గాను 5.67, JMD-4 గాను 2.62, BDVL-2.73 గాను 2.11, YGL-5.01 గాను 1.87, MYDKR-5.17 గాను 1.36, KMLPRM-1.13 గాను 0.33 కోట్లు మాత్రమే వసూలైంది.

News December 18, 2025

స్మార్ట్ కిచెన్ అమలు భేష్.. కడప కలెక్టర్‌కు CM ప్రశంస.!

image

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కడప జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి విద్యార్ధులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రశంసించారు. స్మార్ట్ కిచెన్ అమలులో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని ప్రతి జిల్లా కలెక్టర్ కడప స్మార్ట్ కిచెన్ సందర్శించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.