News January 6, 2025

కడప జిల్లాలో నేడు గ్రీవెన్స్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా సోమవారం కడప కలెక్టరేట్‌లో ఫిర్యాదులను సేకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. గ్రామస్థాయి, మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను, ఫిర్యాదుల రూపంలో తమకు నేరుగా అందించవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News July 6, 2025

వేంపల్లి: ట్రాక్టర్ ఢీ.. 50 గొర్రెలు మృతి

image

కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి- తాళ్లపల్లి మధ్యలో ట్రాక్టర్ ఢీకొని 50 గారెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ గొర్రెలు తాటిమాకులపల్లె ఎస్సీ కాలనీకి చెందిన వారివిగా గుర్తించారు. వీరంతా తాళ్లపల్లిలో మేపుకోసం వెళ్తున్నారు. అటుగా స్పీడుగా వచ్చిన ట్రాక్టర్ గొర్రెలను ఢీకొనగా అక్కడికక్కడే 50 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2025

పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

image

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PS‌లో ఫిర్యాదు చేసింది.