News December 21, 2025

కడప జిల్లాలో పడిపోయిన రబీ సాగు.!

image

రబీలో గత ఏడాది జిల్లాలో లక్ష హెక్టార్లలో పంటలు సాగవ్వగా, ఈ ఏడాది 77,121 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు. (గత-ప్రస్తుత ఏడాది పంటల సాగు హెక్టార్లలో) వరి, గోధుమ, జొన్న, రాగి, కొర్ర తదితర పంటలు 5,145-3,859, శనగ, కంది, మినుము, పెసర, అలసంద పప్పు ధాన్యాలు 89,882-69,933, వేరుశనగ, సన్ ఫ్లవర్, నువ్వులు నూనె గింజలు 4,524-2,516, పత్తి, చెరకు వాణిజ్య పంటలు 141-57 హెక్టార్లలో రైతులు సాగు చేశారు.

Similar News

News February 6, 2026

కడప జిల్లా 10th విద్యార్థులకు మరో ఛాన్స్.!

image

మార్చిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. కడప జిల్లాలో వీటికి హాజరయ్యే రెగ్యులర్/ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థుల కోసం తత్కాల్ పరీక్ష ఫీజు ఆలస్య రుసుముతో చెల్లించడానికి గడువు పొడిగించినట్లు DEO చెప్పారు. రూ.1,000 ఫైన్‌తో ఈనెల 12వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం గమనించాలని ఆయన సూచించారు.

News February 6, 2026

కడప జిల్లాలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

image

కడప డివిజన్ పరిధిలోని సావిశెట్టిపల్లి, వెంకటరెడ్డి పల్లితో పాటు 26 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని దొరసాని పల్లి, సిరిగే పల్లి, సుద్ధపల్లె తదితర గ్రామాల్లో 32 పోస్టులను భర్తీ చేస్తారు. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ చేయండి<<>>.