News October 22, 2024
కడప జిల్లాలో పర్యటించనున్న YS జగన్
కడప జిల్లాలో మూడు రోజుల పాటు మాజీ సీఎం జగన్ పర్యటన ఖరారైంది. బుధవారం తెనాలి నుంచి బద్వేలుకు చేరుకుంటారు. అక్కడ ఉన్మాది చేతిలో బలైన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బ్రహ్మంగారి మఠం చేరుకుని వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల చేరుకుని గురువారం, శుక్రవారం కార్యకర్తలకు జగన్ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 21, 2025
కడప: నేటి నుంచి YVU పీజీ పరీక్షలు
కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ అనుబంధ కళాశాలల MA, M.Com, M.Sc& M.P.Ed. మొదటి సెమిస్టర్ పీజీ పరీక్షలు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కృష్ణారావు తెలిపారు. ఈ పరీక్షలు 21, 23, 25, 27, 29, 31 తేదీలలో ఉంటాయన్నారు. పరీక్షలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
News January 21, 2025
కడప: హత్యాయత్నం కేసులో 12 మందికి జైలు శిక్ష
వీరపునాయునిపల్లె మండలంలో 2014లో గుమ్మిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 12 మందిపై నేరం రుజువైంది. దీంతో ప్రొద్దుటూరు కోర్టు ముద్దాయిలకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.35వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. అప్పటి ఎస్ఐ రోషన్ కేసు నమోదు చేయగా.. నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
News January 21, 2025
కడప కోటిరెడ్డి కాలేజీ అమ్మాయికి అరుదైన గౌరవం
ఈనెల 26వ తేదీ దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు కడపకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ ఎస్.సుమియా ఎంపికైంది. కడప కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్న ఈమె బెటాలియన్ స్థాయి, తిరుపతి గ్రూప్ స్థాయిలతో పాటు ప్రీ రిపబ్లిక్‌డే వేడుకల్లో చక్కటి ప్రదర్శన కనబరిచింది. దీంతో ఢిల్లీలో నిర్వహించే పరేడ్ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఈమెకు లభించింది.