News February 6, 2026
కడప జిల్లాలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

కడప డివిజన్ పరిధిలోని సావిశెట్టిపల్లి, వెంకటరెడ్డి పల్లితో పాటు 26 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని దొరసాని పల్లి, సిరిగే పల్లి, సుద్ధపల్లె తదితర గ్రామాల్లో 32 పోస్టులను భర్తీ చేస్తారు. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
Similar News
News February 7, 2026
నేడు టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నూతన కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన అధ్యక్షుడిగా భూపేష్ సుబ్బరామిరెడ్డిని అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఆధ్వర్యంలో అధ్యక్షుడితో సహా కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
News February 7, 2026
దేవుని కడపకు పోటెత్తిన భక్తులు

తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున నుంచి నిత్య కైంకర్యాలను విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
News February 7, 2026
కడప జిల్లాను వ్యర్థ రహితంగా మార్చాలి: కలెక్టర్

కడప జిల్లాను అన్ని ప్రమాణాలతో వ్యర్థ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో ఉత్పన్నమయ్యే ఘన, ద్రవ వ్యర్థాలను పర్యావరణానికి, ప్రజలకు హాని కలగకుండా శాస్త్రీయంగా నిర్వహించాలని సూచించారు. చెత్త సేకరణ, తరలింపులో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.


