News March 29, 2025

కడప జిల్లాలో ప్రాణం తీసిన బెట్టింగ్

image

బెట్టింగ్ భూతానికి కడప జిల్లాలో ఓ యువకుడు బలయ్యాడు. ప్రొద్దుటూరులో పట్టణంలోని రామేశ్వరానికి చెందిన యువకుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. ఏకంగా రూ.8 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. 1-టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
NOTE: ఐపీఎల్, ఆన్‌లైన్, ఇతర ఏ బెట్టింగ్‌ జోలికి వెళ్లకండి

Similar News

News February 16, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.15,720
* 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.14,462
* వెండి 10 గ్రాముల ధర రూ.2,505.

News February 16, 2026

కడప: ఇవాళే లాస్ట్.. అప్లై చేశారా?

image

కడప డివిజన్ పరిధిలోని సావిశెట్టిపల్లి, వెంకటరెడ్డి పల్లితో పాటు 26 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని దొరసాని పల్లి, సిరిగే పల్లి, సుద్ధపల్లె తదితర గ్రామాల్లో 32 పోస్టులను భర్తీ చేస్తారు. జీతం రూ.12 వేల నుంచి రూ.24,470. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 16, 2026

కడప కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

కడప కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి కలెక్టర్ సభా భవనంలో కార్యక్రమం మొదలవుతుందన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. కడపతో పాటు అన్ని మున్సిపల్, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా అర్జీలు స్వీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు.