News August 27, 2025
కడప జిల్లాలో ఫుట్ బాల్ క్రీడకు పెరుగుతున్న ఆదరణ: ప్రదీప్

సీనియర్ మహిళల ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ఇటీవల ఉత్కంఠంగా ముగిసిందని కడప జిల్లా అధ్యక్షుడు ఎం. డేనియల్ ప్రదీప్ తెలిపారు. ఫైనల్‌లో కడప జిల్లా ఫుట్ బాల్ అసోషియేషన్ జుట్టు అనంతపురం జట్టుతో తలపడిందన్నారు. రెండు జట్లు మధ్య మ్యాచ్ పూర్తి సమయానికి 0-0తో డ్రాగా ముగియడంతో పెనాల్టీ షూట్ అవుట్‌కు వెళ్లింది. కీలకమైన షూట్ అవుట్‌లో అనంతపురం జిల్లా జట్టు 3-2 తేడా విజయం సాధించిందన్నారు.
Similar News
News August 27, 2025
కడప ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోక్ సభ స్పీకర్

ఎక్స్ వేదికగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి బుధవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, కొంతమంది ప్రముఖులు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు పేరున రీ ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
News August 27, 2025
కొండాపురంలో యాక్సిడెంట్.. మృతులు వీరే.!

కొండాపురంలోని లావునూరు రహదారిలో మంగళవారం రాత్రి బైకు – కారు ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శివకుమార్, రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. వారు దుగ్గుపల్లి నుంచి కొండాపురం వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది.
News August 27, 2025
కడప జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ అకౌంట్లు

తన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. తన ఫొటోలు వాడి ఇతరులను మోసం చేసేందుకు ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ఫేక్ హ్యాకర్‌లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు.