News April 4, 2024

కడప జిల్లాలో బెంబేలెత్తిస్తున్న భానుడు

image

జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం రాష్ర్టంలోనే అత్యధికంగా ఒంటిమిట్టలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎండ ప్రభావానికి వృద్ధులు, చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు మధ్యాహ్నం బయటికి రావద్దని హెచ్చరించారు.

Similar News

News July 8, 2024

కడప: విద్యా శాఖ ఆర్జేడీపై బదిలీ వేటు

image

కడప జిల్లా పాఠశాల ఆర్జేడీ రాఘవరెడ్డిపై బదిలీ వేటు వేశారు. ఇటీవల రాఘవరెడ్డిపై అవినీతి, అక్రమాలపై ఆరోపణలు రావడంతో విద్యాశాఖ విచారణ చేపట్టారు. క్రమశిక్షణా చర్యల కింద రాఘవరెడ్డిని విద్యాశాఖ అధికారులు బదిలీ చేశారు. ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. అప్పటి వరకు కడప పాఠశాల ఆర్జేడిగా కర్నూలు డీఈఓ శామ్యూల్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

News July 8, 2024

YSRకు మాజీ సీఎం జగన్ నివాళి

image

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద తన తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ వెంట మాజీ ఎమ్మెల్యేలు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News July 8, 2024

రాయచోటిలో వ్యక్తి దారుణ హత్య

image

రాయచోటిలో ఆదివారం దారుణ హత్య జరిగింది. రాయచోటి మసీదు వీధికి చెందిన ఇర్షాద్ అలీ రెడ్డిబాషా కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె సోదరుడు ఇబ్రహీం(22) తరచూ మద్యం తాగి సోదరి ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేసేవాడు. దీంతో విసుగుచెందిన ఇర్షాద్ బావమరిదిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మద్యం తాగుదామని చెప్పి గున్నికుంట్లకు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి బీరుసీసాతో గొంతు కోసి హత్య చేశాడు.