News July 10, 2025
కడప జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు

కడప జిల్లాలో గురువారం భారీగా పోలీసులు బదిలీ అయ్యారు. 169 పోలీస్ సిబ్బందిని ఒకేసారి బదిలీ చేస్తూ SP అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 24 మంది ASIలు, 32 మంది HCలు, 113 మంది PCలు ఉన్నారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న, ఆరోపణలున్న వారిని బదిలీ చేసిన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వులను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు.
Similar News
News February 21, 2026
మదనపల్లె: కులవర్ధన్ తల్లి కోసం వెతుకులాట

మదనపల్లెలో బాలిక హత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. A1 కులవర్ధన్ చనిపోయిన విషయం తెలిసిందే. A2గా అతని తల్లి అంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ఆమెను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు.
News February 21, 2026
రౌడీ షీటర్లపై అప్రమత్తంగా ఉండండి: కడప SP

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని SP నచికేత్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న రౌడీ షీటర్లు, ట్రబుల్ మేకర్స్‌పై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు.