News November 29, 2024

కడప జిల్లాలో భారీ మోసం

image

కడప జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. కడపలో పనిచేసే ప్రభుత్వ టీచర్ శోభారాణికి అపర్ణ (బెంగళూరు) పరిచయమయ్యారు. బియ్యాన్ని ఆకర్షించే పాత్ర ఉంటే జీవితం మారిపోతుందని దువ్వూరుకు చెందిన మూలే వెంకట రమణారెడ్డిని వారిద్దరూ నమ్మించారు. వాళ్లకు ఆయన విడతల వారీగా రూ.1.37 కోట్లు చెల్లించి మోసపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అపర్ణతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని ప్రొద్దుటూరు సీఐ యుగంధర్ తెలిపారు.

Similar News

News January 14, 2025

కడప: 15న జరగాల్సిన UGC – NET పరీక్ష వాయిదా

image

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2025 జనవరి 15న జరగాల్సిన UGC-NET డిసెంబర్ 2024 పరీక్షను సంక్రాంతి, పొంగల్ పండుగ సందర్భంగా వాయిదా వేశారు. 16 నుంచి జరగాల్సిన మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం వెబ్‌సైట్ www.nta.ac.in ను సందర్శించాలని ఎన్టీఏ (ఎగ్జామ్స్) డైరెక్టర్ రాజేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కొత్త పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

News January 13, 2025

రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామనాథ్ హెగ్డే

image

రాజంపేటలో ఏఎస్పీ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇంతవరకు రాజంపేటలో డీఎస్పీ స్థాయి అధికారి మాత్రమే ఉండగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏఎస్పీని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ మనోజ్ రామనాథ్ హెగ్డేను రాజంపేట సబ్ డివిజన్ నూతన ఏఎస్పీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.