News January 31, 2026
కడప జిల్లాలో మూడు ఆలయాలకు ఈవోల నియామకం

కడప జిల్లాలోని 3 ప్రధాన దేవాలయాలకు కొత్త ఈవోలను నియమిస్తూ శనివారం ప్రభుత్వం జారీ చేసింది. గండి ఆంజనేయస్వామి ఆలయానికి కర్నూలు ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్‌ను నియమించారు. ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి కేవీ రమణ, ప్రొద్దుటూరు శ్రీకృష్ణ గీతాశ్రమానికి శ్రీధర్‌ను నియమించారు. ఈ మూడు ఆలయాలకు ఈవోగా ఉన్న వెంకటసుబ్బయ్య శనివారం పదవీ విరమణ చేస్తున్నారు.
Similar News
News February 13, 2026
పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి: విలియం కటింగ్

జమ్మలమడుగు పట్టణంలోని సీఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్‌ను పూర్వ వైద్యుడు డాక్టర్ విలియం కటింగ్ సందర్శించారు. శుక్రవారం ఆయన హాస్పిటల్లోని ప్రతి వార్డులో తిరిగి తన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.1961-1973 నాటికి, ఇప్పటికీ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందిందని హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం 6.30కు ఫొటో ఆల్బమ్ విడుదల చేస్తామని హాస్పిటల్స్ సూపరిటెండెంట్ డాక్టర్ అగస్టిన్ రాజ్ తెలిపారు.
News February 12, 2026
YVU దూరవిద్య సమాచారం కోసం ప్రత్యేక డొమైన్

YVU దూరవిద్య సంబంధిత సమగ్ర సమాచారం అందుబాటులోకి తెస్తూ వైవీయూ వెబ్సైట్లో ప్రత్యేక డొమైన్‌ను VC ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ప్రారంభించారు. అనుబంధ దూరవిద్యా కేంద్రాలకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. కోర్సులు, అడ్మిషన్లు, ఫీజులు, పరీక్షల షెడ్యూల్ ఇలా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ పి.పద్మ, ప్రొ.కె.కృష్ణారెడ్డి, ప్రొ.తుమ్మలకుంట శివ, డా.శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
News February 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.15,910
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.14,637
*వెండి 10 గ్రాముల ధర: రూ.2,675 గా ఉన్నాయి.


