News April 18, 2024
కడప జిల్లాలో మొదటి రోజు ఎంత మంది నామినేషన్ వేశారంటే?

సార్వత్రిక ఎన్నికలు – 2024 కు సంబంధించి కడప జిల్లాలో నేడు మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా ప్రారంభం అయిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప పార్లమెంట్ కు 2, అసెంబ్లీకి 3, జమ్మలమడుగుకు 2, ప్రొద్దుటూరుకి 1, మైదుకూరుకు 3 నామినేషన్ దాఖలు కాగా, బద్వేలు, పులివెందుల, కమలాపురం పరిధిలో ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు కాలేదన్నారు.
Similar News
News February 11, 2026
కమలాపురం: ‘హత్య కేసులో ముగ్గురికి జీవితఖైదు’

కమలాపురం పరిధిలో 2017లో జరిగిన సుధీకర్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కడప IV అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి. దీనబాబు తీర్పు వెల్లడించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో A1 గౌరీగల్లే ఈశ్వరమ్మ, A2 షిండే చంద్ర, A3 సయ్యద్ ముబారక్ కలిసి కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. ముగ్గురికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించారు.
News February 11, 2026
కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన కడప ఎంపీ

ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని కమలాపురం స్టేషన్‌లో చెన్నై – ముంబై మెయిల్ ఎక్సప్రెస్ స్టాపింగ్ ఏర్పాటు చేయాలని, మరికొన్ని ఎక్సప్రెస్ రైళ్లు కొండాపురం, ఎర్రగుంట్లలో స్టాపింగ్ కోసం లేఖ ఇచ్చారు. అలాగే జిల్లాలోని రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు.
News February 11, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరులో బుధవారం బంగారం, వెండి ధరల వివరాలు:
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.15,920
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర: రూ.14,646
* 10 గ్రాముల వెండి ధర: రూ.2,705.


