News January 2, 2025
కడప జిల్లాలో రూ.14 కోట్ల మద్యం తాగేశారు
నూతన సంవత్సరానికి మందు బాబులు ఫుల్ కిక్‌తో స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కడప జిల్లాలో డిసెంబర్ 30, 31 జనవరి 1న రూ.14,51,06,769 మద్యాన్ని మందు బాబులు తాగేశారు. వీటిలో లిక్కర్ 18,586 కేసులు, బీర్లు 8586 కేసులు అమ్మకాలు జరిగాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు.
Similar News
News January 4, 2025
కడప: ‘ఉచిత ఇసుక పంపిణీ పక్కాగా అమలు చేయాలి’
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. నూతన ఇసుక పాలసీ, ఇసుక బుకింగ్ ఇతర అంశాలపై గనులు భూగర్భ శాఖ కార్యదర్శి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఉచిత ఇసుక పాలసీని మరింత మెరుగుపరచాలని కలెక్టర్లను శుక్రవారం ఆదేశించారు.
News January 4, 2025
అన్నమయ్య: శేషాచలం అడవుల్లో ఆరుగురు మిస్సింగ్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిసరాలైన శేషాచలం అడవుల్లో బిటెక్ విద్యార్థులు దారి తప్పిపోయారు. శ్రీ కాళహస్తి నుంచి వచ్చిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు, అడవిలోని అందమైన వాటర్‌ఫాల్స్‌ను చూసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు దారితప్పి శుక్రవారం అడవిలో చిక్కుకుపోయారు. దారి తప్పిన ఆరుగురిలో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇలా మిస్ అయినట్లు పోలీసులకు తెలపగా వారు గాలిస్తున్నారు.
News January 3, 2025
ప్రొద్దుటూరు: 184 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
రూరల్ పరిధిలోని ఆటోనగర్లో అక్రమంగా నిలువ ఉంచిన 184 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. రూరల్ పోలీసులు అందించిన సమాచారం మేరకు ఒక రూమ్‌లో దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్వో గంగయ్య, డీటీ మల్లికార్జున, ఇతర అధికారుల సమక్షంలో పంచనామా చేసి అక్రమ బియ్యాన్ని సీజ్ చేశారు.