News February 27, 2026
కడప జిల్లాలో రూ. 2 కోట్లు పట్టివేత

కడప జిల్లా ఎర్రగుంట్లలో దాదాపు రూ.2 కోట్లకు పైగా నగదు తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం అతను ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన బంగారు వ్యాపారస్థుడని తెలుస్తోంది. నగదు మూలం ఏమిటి, సంబంధిత బిల్లులు చూపించాలని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 6, 2026
ఎల్లుండి ఫైనల్.. అభిషేక్ శర్మ వైపే మొగ్గు!

T20WCలో వరుసగా విఫలం అవుతున్న అభిషేక్ శర్మను పక్కన పెట్టాలనే డిమాండ్స్ వస్తున్నాయి. అయితే అతడికి ఫైనల్లోనూ ఛాన్స్ ఇవ్వాలని టీమ్ యాజమాన్యం యోచిస్తున్నట్లు PTI తెలిపింది. అభిషేక్ దూకుడును సపోర్ట్ చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందని పేర్కొంది. టీమ్‌లో మార్పులు చేస్తే కాంబినేషన్ డిస్టర్బ్ అవుతుందని, అందుకే ఫైనల్లో మార్పులు ఉండకపోవచ్చని పేర్కొంది.
News March 6, 2026
భద్రాద్రి శ్రీరామనవమి, పట్టాభిషేకం టికెట్ కౌంటర్లు ఎక్కడంటే.!

ఈనెల 27, 28 తేదీలలో భద్రాద్రి శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలను వీక్షించే భక్తులకు సెక్టార్ల వారీగా టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా విక్రయించినట్లు ఆలయ ఈవో ప్రకటనలో వెల్లడించారు. ఆఫ్లైన్ టికెట్ల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు: 1.ఆలయము వద్ద మెయిన్ టిక్కెట్ కౌంటర్, 2.తానీషా కళ్యాణ మండపం CRO, 3.బ్రిడ్జి పాయింట్ CRO, 4. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ ప్రాంతాలలో కౌంటర్లను ఏర్పాటు చేశారు.
News March 6, 2026
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

➤కాశీబుగ్గ: గంజాయితో ముగ్గురు అరెస్ట్
➤శ్రీకాకుళం: వైసీపీ నియోజకవర్గ పరీశీలకుల నియామకం
➤ కొండములగాం సీహెచ్సీలో నాగుపాము హల్‌చల్
➤మందస: ఎవరు వస్తారు..దారి మనదే బాగుచేసుకోవాల్సిందే!
➤శ్రీకాకుళం జిల్లాలో “పది” పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
➤నందిగాం మండల కేంద్రంలో లేగదూడల ప్రదర్శన
➤పలాస: ‘ప్రభుత్వ భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి’
➤ పోలాకి తీర గ్రామాల్లో సోలార్ విద్యుత్ దీపాల ఏర్పాటు


