News March 9, 2025
కడప జిల్లాలో వెనుకబడిన వర్గాలను బలోపేతం చేయాలి: మంత్రి

జిల్లాలో వెనుకబడిన తరగతుల వర్గాలను బలోపేతం చేసి ముందుకు నడిపించాలని బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. శనివారం కడపలోని ఆర్& బి అతిధి గృహంలో.. బీసీ సంక్షేమ శాఖాధికారులు, చేనేత జౌళిశాఖ అధికారులతో.. సమీక్షా సమావేశం నిర్వహించారు. సవిత మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నారు.
Similar News
News March 9, 2025
ప్రొద్దుటూరులో భార్యాభర్తలను కలిపిన జడ్జి

ప్రొద్దుటూరు కోర్టులో నిన్న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈక్రమంలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన సాంబశివా రెడ్డి శుక్రవీణను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సాప్ట్‌వేర్ ఇంజినీర్లు అయిన భార్యాభర్తలు చిన్నపాటి వివాదంతో విడిపోయారు. భార్య జాతీయ లోక్ అదాలత్‌ను ఆశ్రయించగా జడ్జి సత్యకుమారి భర్తతో మాట్లాడారు. జడ్జి సూచనలతో భార్యాభర్తలు ఒకటయ్యారు.
News March 9, 2025
అనారోగ్యంతోనే నా బిడ్డ మృతి: YS అభిషేక్ తండ్రి

తన బిడ్డ మృతిపై దుష్ర్పచారం చేయడం బాధాకరమని YS అభిషేక్ రెడ్డి తండ్రి YS మదన్ మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘వివేకా హత్య కేసు సాక్షులంతా అనుమానాస్పదంగా చనిపోతున్నారని కొన్ని మీడియా సంస్థలు దుష్ర్పచారం చేస్తున్నాయి. నా కుమారుడు అనారోగ్యంతోనే చనిపోయాడు. గంగిరెడ్డి, వాచ్‌మెన్ రంగన్న సైతం ఆరోగ్యం సరిగా లేక కన్నుమూశారు. ప్రభుత్వం సిట్ అంటోంది. అది కాదు జ్యుడీషియల్ విచారణ చేపట్టండి’ అని ఆయన కోరారు.
News March 8, 2025
రాయచోటి: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

అన్నమయ్య జిల్లాలో శనివారం తెల్లవారుజామనున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కె.వి పల్లి మండలం, మహల్ క్రాస్ టర్నింగ్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు రాయచోటి నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో పాల వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని డ్రైవర్ ఢిల్లీబాబు(33), టి.వెంకటేశ్ (23) మృతి చెందారు. మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు.