News August 21, 2025
కడప జిల్లాలో 16,528 హెక్టార్లలో పంటల సాగు

కడప జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77,475 హెక్టార్లు కాగా, 16,528 హెక్టార్లలోనే పంటల సాగు జరిగింది. వరి 7,116.27, జొన్న 48.08, మొక్క జొన్న 1,843.21, రాగి 10.5, కొర్ర 11.6, బాజ్ర 710 హెక్టార్లలో సాగు చేశారు. కంది 369.8, మినుములు 1,503.09, పెసలు 11.13 హెక్టార్లలో సాగు జరిగింది. వేరుశనగ 998.88, పొద్దుతిరుగుడు 225.7, కుసుమ 43.2, సోయాబీన్ 47, చెరకు 16, ఇతర పంటలు 10 హెక్టార్లలో సాగు చేశారు.
Similar News
News April 14, 2026
కడప: స్పోర్ట్స్ కోటా టీచర్లకు తిరుపతిలో రేపు సమావేశం

మెగా డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోట ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 15న తిరుపతిలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ మంగళవారం తెలిపారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు డీఎస్డీవో/డీఎస్ఏ కార్యాలయం, తిరుపతిలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి ప్రత్యేక సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
News April 13, 2026
నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించాలి: SP

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”లో జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 152 ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.