News March 29, 2024

కడప జిల్లాలో 26 ఓట్లతో గెలిచిన MLA ఎవరో తెలుసా?

image

మైదుకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిసారి 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రామారెడ్డి 11 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గానికి ఐదుగురు మాత్రమే MLAలుగా ప్రాతినిధ్యం వహించగా, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి డీఎల్ రవీంద్రరెడ్డి కేవలం 26 ఓట్ల తేడాతో రఘురామిరెడ్డి (TDP)పై గెలుపొందారు. దీంతో జిల్లాలో తక్కువ ఓట్లతో ఓడిన, గెలిచిన వ్యక్తులుగా నిలిచారు.

Similar News

News July 5, 2024

గువ్వలచెరువు ఘాట్ సొరంగ మార్గానికి రూ.1000 కోట్లు

image

కడప – రాయచోటి మార్గమధ్యలోని గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనదారుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ప్రమాదకరంగా ఉండే ఈ ఘాట్‌కు ప్రత్యామ్నాయంగా.. ఆ కొండకు సొరంగం తవ్వి, నాలుగు వరుసల రహదారి నిర్మించేందుకు కేంద్రం రూ.1,000 కోట్లు నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 14 జాతీయ రహదారులకు రూ.4,744 కోట్లతో 2024-25 వార్షిక ప్రణాళికకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

News July 5, 2024

రేపు కడపకు రానున్న YS జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతరం 8వ తేదీన తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఆయన రేపు సాయంత్రం కడప రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం ద్వారా కడపకు చేరుకొని రోడ్డు మార్గాన ఇడుపులపాయ వెళ్తారని కడప మేయర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు తెలిపారు.

News July 5, 2024

రాజంపేట సబ్ జైలు నుంచి ఖైదీ పరార్

image

రాజంపేట సబ్ జైలు నుంచి బాషా అనే ఖైదీ గురువారం పరార్ అయ్యారని పట్టణ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఉదయం 8-9 గంటల సమయంలో వంట చేయడానికి ఖైదీలను జైలు గది నుంచి బయటకు వదిలిన సమయంలో దుప్పట్లను తాడుగా చేసుకుని గోడ దూకి పరారయ్యాడని జైలర్ మల్లారెడ్డి తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. హత్య కేసులో ముద్దాయి బాషా గత ఏడాది నవంబర్ నుంచి జైలులో ఉన్నారు. ఇతనిది రైల్వే కోడూరు అని తెలిపారు.