News August 7, 2025
కడప జిల్లాలో 3,334 మగ్గాలు.!

కడప జిల్లాలో 3,334 మగ్గాలకు విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. డివిజన్ల వారీగా..
కడపలో 929, మైదుకూరులో 935, ప్రొద్దుటూరులో 1,364, పులివెందులలో 106 సర్వీసులు ఉన్నాయి.
అలాగే జిల్లాలో 10 HPలో ఉన్న పవర్ లూమ్స్ సర్వీసులు 203 మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రొద్దుటూరు డివిజన్‌లోనే ఉన్నాయి. నేటి నుంచి ఈ హ్యాండ్లూమ్స్‌కు 200, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Similar News
News February 3, 2026
ప్రొద్దుటూరులో పెరిగిన బంగారం, వెండి ధరలు.!

ప్రొద్దుటూరులో నిన్నటికన్నా ఈరోజు బంగారు, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర నిన్న రూ.14,900 ఉండగా.. నేడు రూ.15,850కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర నిన్న రూ.13,708గా ఉండగా.. నేడు రూ.14,582కు చేరుకుంది. ఇక వెండి 10 గ్రాముల ధర నిన్న రూ.2,500 ఉండగా.. రూ.280 పెరగడంతో రూ.2,780కు చేరుకుంది.
News February 3, 2026
కడప జిల్లాకు అలా ఆదాయం రూ.205 కోట్లు.!

కడప జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 31 నాటికి రూ.205 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి లభించింది. (రూ.కోట్లలో) బద్వేల్-10.71, జమ్మలమడుగు-11.74, కమలాపురం-9.53, ప్రొద్దుటూరు-46.10, మైదుకూరు-7.77, ముద్దనూరు-3.95, పులివెందుల-13.23, సిద్దవటం-2.66, వేంపల్లె-6.75, దువ్వూరు-2.79, కడప(U)-50.45, కడప(R)-39.35 ఆదాయం లభించింది.
News February 3, 2026
బద్వేల్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

బద్వేల్ రైస్ మిల్లుల్లో సోమవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేశారు. రైస్ మిల్లుల్లోని నిల్వలను, రికార్డులను పరిశీలించారు. మార్కెట్ సెస్ చెల్లించని సరుకును గుర్తించారు. వాటి విలువను లెక్కించారు. మిల్లుల యజమానుల నుంచి రూ.10,69,528లు వ్యవసాయ మార్కెట్ సెస్సు వసూలు చేశారు. జేడీఎం రామాంజనేయులు ఆదేశాల మేరకు జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నారు.


