News August 4, 2024
కడప జిల్లాలో 99.30% పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

కడప జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం 99.30% పూర్తయిందని కడప కలెక్టర్ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం మొదలైన పింఛన్ల పంపిణీ ప్రక్రియ శనివారానికి పూర్తయిందన్నారు. పెన్షన్ ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తిచేసిన సచివాలయ ఉద్యోగులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. జిల్లాకు రాష్ట్రంలో మంచి పేరు తీసుకురావడం జరిగిందన్నారు.
Similar News
News April 14, 2026
కడప: స్పోర్ట్స్ కోటా టీచర్లకు తిరుపతిలో రేపు సమావేశం

మెగా డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోట ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 15న తిరుపతిలో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ మంగళవారం తెలిపారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు డీఎస్డీవో/డీఎస్ఏ కార్యాలయం, తిరుపతిలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. విద్యాశాఖ మంత్రి ప్రత్యేక సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
News April 13, 2026
నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించాలి: SP

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”లో జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 152 ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.