News August 11, 2025
కడప జిల్లాలో AMCల వసూళ్లు రూ.11.99 కోట్లు

కడప జిల్లాలోని 10 AMCలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.11.99 కోట్లు ఆదాయాన్ని ఆర్జించాయి. కడప AMC నుంచి రూ.1.61 కోట్లు, ప్రొద్దుటూరు రూ.1.74 కోట్లు, బద్వేల్ రూ.2.05 కోట్లు, జమ్మలమడుగు రూ.1.04 కోట్లు, పులివెందుల రూ.98 లక్షలు ఆదాయం వచ్చింది. మైదుకూరు రూ.2.26 కోట్లు, కమలాపురం రూ.86.80 లక్షలు, సిద్దవటం రూ.28.20 లక్షలు, ఎర్రగుంట్ల రూ.71.83 లక్షలు, సింహాద్రిపురం రూ.16.78 లక్షలు ఆదాయాన్ని ఆర్జించాయి.
Similar News
News September 8, 2025
ఉల్లిని ప్రభుత్వమే కొంటుంది: మైదుకూరు AMC ఛైర్మన్

ఉల్లి సాగు చేసిన రైతులు దళారులను నమ్మవద్దని, మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మైదుకూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏపీ రవీంద్ర చెప్పారు. పెద్ద బళ్లారి రకం ఉల్లి పంట చేతికొచ్చిందని.. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరగా అమలయ్యేలా చూస్తామన్నారు.
News September 8, 2025
వనిపెంట: ఆ నర్సరీలతో నష్టపోతున్న రైతన్నలు..?

వనిపెంట ప్రాంతంలో నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా ఇష్టానుసారంగా నర్సరీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత లేని, కల్తీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నర్సరీ యజమానులు కొందరు నాణ్యత లేని విత్తనాల నారును రైతులకు అంటగడుతూ లాభం పొందుతున్నారు. నర్సరీలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
News September 8, 2025
కడప జిల్లాలో తెరుచుకున్న ఆలయాలు

చంద్రగ్రహణం సందర్భంగా కడప జిల్లాలోని అన్ని ఆలయాలు మూత పడిన విషయం తెలిసిందే. గ్రహణం వీడటంతో ఇవాళ తెల్లవారుజామున ఆలయాలు తెరిచారు. ఒంటమిట్ట కోదండరామాలయంలో టీటీడీ అర్చకులు ఆలయ శుద్ధి చేశారు. తర్వాత సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జిల్లాలోని ఇతర ఆలయాల్లోనూ దర్శనాలు తిరిగి మొదలయ్యాయి.