News June 25, 2024

కడప జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే.?

image

టీచర్ ఉద్యోగం కలల స్వప్నాన్ని ప్రభుత్వం సాకారం చేసేందుకు సిద్ధమైంది. మెగా DSC నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి కడప జిల్లాలో 298 ఎస్టీటీలతో కలిపి మొత్తం 709 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించనున్నారు.

Similar News

News June 29, 2024

రాయచోటి: నా ఇల్లు నాకు ఇప్పించండని మహిళ ఆవేదన

image

అన్నమయ్య జిల్లా సుండుపల్లికి చెందిన వికలాంగురాలు షాహిదా ఇంటిని ఓ వ్యక్తి అద్దెకి తీసుకొని రిజిస్టర్ చేయించుకొని తనని బయటకు గెంటేశాడని బాధితురాలు వాపోయింది. ఈ విషయంపై బాధితురాలు చాలా రోజుల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఉపయోగం లేకపోవడంతో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసింది. జాయింట్ కలెక్టర్ ఫర్ మాన్ అహ్మద్ విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News June 29, 2024

బద్వేల్: ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ

image

ఎర్రచందనం అక్రమ రవాణాలో సంబంధం ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుళ్లను శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సస్పెండ్ చేశారు. ఇటీవల పట్టుబడిన ఎర్ర చందనం కేసులో బద్వేలు అర్బన్ స్టేషన్ కానిస్టేబుల్ సుధాకర్, అట్లూరు స్టేషన్ కానిస్టేబుల్ రామకృష్ణ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

News June 29, 2024

ప్రొద్దుటూరు: ‘విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి’

image

విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని డాక్టర్ అపర్ణ శ్రీరామ్, యునాని డాక్టర్ నిరంజన్ నాయక్ తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు హోమస్ పేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. 260 మంది విద్యార్థులకు వ్యాధి నిరోధక హోమియో మందులను ఇచ్చారు.