News September 22, 2024

కడప జిల్లా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికను రూపొందించండి: కలెక్టర్

image

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 ఆశయ సాధనలో భాగంగా కడప జిల్లా ఆర్థికాభివృద్ధికి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందడుగు వేయాలి జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు దూర దృష్టితో విజన్ ఆంధ్ర @2047 తీసుకురావడం జరిగిందన్నారు. కీలక రంగాలపైన దృష్టి సారించి జిల్లా అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలన్నారు.

Similar News

News September 22, 2024

కడప: న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి

image

అందరికి న్యాయం అందాలని, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హై కోర్ట్ జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కడప పోలీస్ పెరేడ్‌లోని మీటింగ్ సమావేశంలో జిల్లా స్థాయి జుడీషియల్ అధికారుల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. అమలవుతున్న యాక్ట్స్‌పై న్యాయవాదులు నిబద్ధతతో చట్టాలను అమలు చేయాలని సూచించారు.

News September 21, 2024

కోడూరు: మృత్యువుతో పోరాడి చిన్నారి మృతి

image

ఓ చిన్నారి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. రైల్వే కోడూరుకు చెందిన కొక్కంటి మహేశ్ మూడు రోజుల క్రితం తండ్రి పెద్ద కర్మ పనుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో మహేశ్ కూతురు లాస్య(4) ప్రమాదవశాత్తు వంట పాత్రలో పడింది. గమనించిన బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న MLA శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

News September 21, 2024

పెనగలూరు: పోరాడి ప్రియుడిని పెళ్లి చేసుకుంది

image

ప్రేమించిన ప్రియుడి కోసం ఓ యువతి పోరాడి సాధించింది. పెనగలూరు మండలం ఈటిమార్పురానికి చెందిన పొసలదేవి లావణ్యను ప్రేమించిన యువకుడు బైర్రాజు వెంకట సాయి వివాహం చేసుకున్నారు. తనను ప్రేమించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని పురుగు మందు తాగి చచ్చిపోతానంటూ లావణ్య పెనగలూరు పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం బైఠాయించింది. అయితే ఎట్టకేలకు రాజంపేటలో పెద్దల సమక్షంలో వెంకట సాయి లావణ్యను పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమైంది.