News August 20, 2025

కడప జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

కడప జిల్లాలో వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియాను అక్రమంగా విక్రయించడం, పరిశ్రమలకు మళ్లిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీధర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టెక్నికల్ గ్రేడ్ యూరియా (TGU)ని పరిశ్రమల అవసరాలకు మళ్లిస్తున్నారన్న విషయమై వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో JDA నాయక్ పాల్గొన్నారు.

Similar News

News August 20, 2025

సెర్ప్ ద్వారా పేదరిక నిర్మూలన: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో 25 సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్) పేదరిక నిర్మూలన కోసం కృషిచేస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం రాత్రి DRDA సమీక్షలో..
26,965 స్వయం సహాయక సంఘాల ద్వారా 2.62 లక్షల మంది మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారన్నారు. వివిధ రంగాల్లో జీవనోపాధి పొందుతూ సాధికారత దిశగా అడుగులేస్తున్నారని అన్నారు. అధికశాతం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారన్నారు.

News August 20, 2025

రైతులకు స్వయంసహాయక సంఘాలు ఉపయోగపడాలి: కలెక్టర్

image

గ్రామాల్లో సుస్థిర, జీవనోపాధులను నెలకొల్పేందుకు రైతులకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చేలా, రైతు ఉత్పత్తి సంస్థలు స్వయంసహాయక సంఘాలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో DRDA PD రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

News August 20, 2025

ప్రొద్దుటూరు సబ్ జైల్ సిబ్బందికి చార్జ్ మెమోలు.!

image

25 కేసుల్లో నిందితునిగా ఉన్న రిమాండ్ ఖైదీ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు సబ్ జైలునుంచి తప్పించుకు పోవడంపై జైలు సిబ్బందికి ఉన్నతాధికారులు చార్జ్ మెమోలు జారీ చేశారు. ఖైదీ పరారీ సమయంలో విధుల్లో ఉన్న ఇన్‌ఛార్జ్ జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు జైలు సిబ్బందికి చార్జ్ మెమోలు ఇచ్చారు. ఈనెల 16న పరారైన రఫీ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు.