News December 22, 2025

కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా జబిబుల్లా

image

కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరు మైనార్టీ నేత జబిబుల్లాను పార్టీ అధిష్టానం నియమించింది. ప్రొద్దుటూరుకు చెందిన జబిబుల్లా టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైఎస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల స్థానిక టీడీపీ శ్రేణులు, మైనార్టీ నేతలు అభినందనలు తెలిపారు. తన నియామకానికి మద్దతునిచ్చిన, సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి జబిబుల్లా కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News December 23, 2025

కడప జిల్లాలో వీకెండ్ ఎమ్మెల్యేలు?

image

కడప జిల్లాలో కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. వారానికి 2 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. కింది స్థాయి నాయకులను పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కడప MLA మాధవిరెడ్డిపై సొంతపార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇక మైదుకూరు MLA పుట్టా సుధాకర్ కూడా వీకెండ్ MLAగా నియోజకవర్గంలో పర్యటించండంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.

News December 23, 2025

అంతా హేమాహేమీలే.. భూపేశ్‌కు కత్తి మీద సామే!

image

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న ఆయనకు జిల్లాలోని హేమాహేమీలైన నేతలను మేనేజ్ చేయడం కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. ఎమ్మెల్యేలందర్నీ ఒకతాటిపై తీసుకొచ్చి.. లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీకి అధిక సీట్లను కైవసం చేసుకునేలా చేయడం ఆయనకు అతి పెద్ద టాస్క్. అలాగే అంతర్గత పార్టీ కుమ్ములాటలకు భూపేశ్ ఏ విధంగా పరిష్కారం చూపుతారనేది చూడాలి.

News December 23, 2025

కడప: ‘విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం’

image

నిరంతరాయంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో కరంటోళ్ల జనబాట”కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యుత్ సమస్యలపై ప్రజలకు వెంటనే పరిష్కారం అందించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన “కరంటోళ్ల జనబాట” అనే వినూత్న కార్యక్రమం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.