News April 15, 2024

కడప జిల్లా నుంచి TDPలో నలుగురికి కీలక పదవులు

image

ఉమ్మడి కడప జిల్లాలోని నలుగురు టీడీపీ నేతలకు పార్టీలో కీలక పదవులు దక్కాయి. రైల్వే కోడూరుకు చెందిన విశ్వనాధ నాయుడిని పార్టీ రాష్ర్ట కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. కడపకు చెందిన సూదా దుర్గా ప్రసాద్, పొన్నూరు రాం ప్రసాద్ రెడ్డి, రాజంపేటకు చెందిన ఇడమడకల కుమార్‌లను రాష్ర్ట కార్యదర్శులుగా పార్టీ నియమించింది. చంద్రబాబు ఆదేశాల మేరకు.. ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు అచెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.

Similar News

News February 22, 2026

తిరుపతి: B.Ed విద్యార్థిని సూసైడ్

image

తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే కోడూరులోని రంగనాయకులపేటలో B.Ed చదువుతున్న ఆమంచి భార్గవి (24) ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పద్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు SI లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 22, 2026

ఎర్రగుంట్ల: రాత్రి రైలు ఎక్కి.. ఉదయానికి మిస్సింగ్

image

మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఉదయం ముక్కా ధనలక్ష్మి (25) అదృశ్యమైంది. ఈ మహిళ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గురువిమానిపల్లెకి చెందిన జగదీశ్వర్‌రెడ్డి భార్య. ఇరువురు విజయవాడలో శుక్రవారం రాత్రి రిజర్వేషన్ బోగీలో ఎక్కారు. తెల్లవారేసరికి తన భార్యలేదని భర్త ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 21, 2026

కడప జిల్లాలో ఆ కుటుంబం శకం ముగియనుందా?

image

బద్వేల్లో 60 ఏళ్లుగా బిజి వేముల వీరారెడ్డి కుటుంబం పాలకవర్గం లేదా ప్రతిపక్షంలో ఉంటూ వస్తోంది. అయితే బద్వేల్ రిజర్వ్‌డ్‌లోకి వెళ్లడంతో వారు సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోతూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రితేశ్ రెడ్డిని తప్పించి DCCB ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి ఇన్‌ఛార్జ్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే 60 ఏళ్ల తర్వాత ఆ కుటుంబం కథ ముగుస్తుందనే చెప్పవచ్చు.