News February 9, 2025
కడప జిల్లా ప్రజలు జాగ్రత్త..!

కడప జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారం మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యూడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న కడప జిల్లాలో గరిష్ఠంగా 34.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని, తగిన మోతాదులో నీరు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Similar News
News March 12, 2025
కడప: యూత్ పార్లమెంట్ పోస్టర్లు ఆవిష్కరించిన JC

జాతీయ యూత్ పార్లమెంట్ ఉపన్యాసాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువత ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఉపన్యాసాల ద్వారా యువతలోని ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి మణికంఠ పాల్గొన్నారు.
News March 12, 2025
కడప జిల్లాను పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తాం: కలెక్టర్

కడప జిల్లా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని, వాటి విలువలు అందరికీ తెలిపే విధంగా ప్రసిద్ధ ప్రదేశాలు, ఆలయాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. మంగళవారం ఇంటాక్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న పురాతన కట్టడాలు, ప్రసిద్ధ ఆలయాలు, బౌద్ధ జైన వారసత్వ ప్రదేశాలు, కళలు, సంప్రదాయాలు తెలియజెప్పేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
News March 11, 2025
సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలి: కడప ఎస్పీ

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, న్యాయం చేయాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికల కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.