News April 11, 2025

కడప జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

కడప జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 64 పరీక్షా కేంద్రాల్లో 32,885 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 17,114 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 15,771 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News April 18, 2025

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం

image

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వేంపల్లి చెందిన సుబ్రహ్మణ్యంను పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు నియామక ధ్రువపత్రాన్ని ఆయనకు మాజీ ఎంపీ తులసి రెడ్డి, పులివెందుల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు సూచించారు.

News April 18, 2025

కడప – రాయచోటి రోడ్డుపై యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

image

రామాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా కడప – రాయచోటి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం మండలం గొల్లపల్లికి చెందిన పప్పిరెడ్డి ఇరగం రెడ్డి మృతిచెందారు. ద్విచక్రవాహనంలో రోడ్డు దాటుతుండగా, కడప నుంచి రాయచోటి వైపు వెళుతున్న కారు ఢీ కొట్టింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 18, 2025

వేంపల్లెలో బాలికపై అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

image

వేంపల్లెలో ఓ బాలికను ఇద్దరు యువకులు వారం రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితులు ఫాజిల్, ఆనంద్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. కోర్టులో హాజరుపర్చగా నిందుతులకు రిమాండ్ విధించగా కడప సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

error: Content is protected !!