News August 3, 2024

కడప జిల్లా TODAY TOP NEWS

image

✎ ఇవాళ కడప మొదటి ఎంపీ వర్ధంతి
✎ పుల్లంపేటలో కరెంట్ షాక్‌తో బాలుడు మృతి
✎ ఉమ్మడి కడప జిల్లాలో సీఐల బదిలీలు
✎ కడప: పెన్షన్ల పంపిణీలో అలసత్వం.. నోటీసులు జారీ
✎ ఎర్రగుంట్లలో రైలు కిందపడి వ్యక్తి మృతి
✎ ప్రొద్దుటూరు: TDPలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు
✎ కడప: ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
✎ ఒంటిమిట్టలో సుగవాసి బ్యానర్లు చించివేత
✎ ఎర్రగుంట్ల RTPPలో క్రేన్ ఢీకొని వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

Similar News

News April 6, 2026

నీటి భద్రత అందరి బాధ్యత: కలెక్టర్ శ్రీధర్

image

జలధార కార్యక్రమంలో భాగంగా కడపలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు అమలయ్యే ఈ ప్లాన్ ద్వారా నీటి భద్రత, సాగునీటి పొదుపు, డ్రిప్ సాగు, వర్షపు నీటిని ఒడిసిపట్టడం వంటి అంశాలను పటిష్టం చేయాలన్నారు. నీటి సంరక్షణ మనందరి సమిష్టి బాధ్యత అని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

News April 6, 2026

కడప జిల్లా పోలీస్ PGRSకు 114 ఫిర్యాదులు

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు సోమవారం 114 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు దారులతో ఆయన స్వయంగా మాట్లాడి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎవరైనా తమ సమస్యలను విన్నవించుకోవచ్చని చట్ట పరిధిలో వారికి న్యాయం చేస్తామని తెలిపారు.

News April 6, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,070
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,864
* వెండి 10 గ్రాముల ధర రూ.2,385.