News August 19, 2024
కడప జిల్లా TODAY TOP NEWS

✎ కడప: ఆర్టీసీ ఈడీ నియామకంపై అయోమయం
✎ ఒంటిమిట్ట: వైభవంగా కోదండ రాముని పౌర్ణమి కళ్యాణం
✎ బెంగళూరులో విద్యుత్ షాక్‌తో కడప యువకుడి మృతి
✎ వైసీపీ నేతలు కారుకూతలు కూస్తున్నారు: బీటెక్ రవి
✎ ప్రొద్దుటూరు: 25న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
✎ కంపెనీలు తెచ్చే ముఖమా వైఎస్ జగన్ నీది?: బీటెక్ రవి
✎ ముద్దనూరు: 500 క్యూసెక్కుల నీరు విడుదల
✎ కడప జిల్లాలో బాధ్యతలు చేపట్టిన ఎస్సై, సీఐలు
Similar News
News January 25, 2026
పుష్పగిరిలో అద్భుత శిల్పం

వల్లూరు మండలం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలోని ‘పాద కంటక’ (ముళ్లు తీసే) శిల్పం అద్భుతమని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ తెలిపారు. సాధారణ గిరిజన వేషధారణకు భిన్నంగా, ఇందులో కిరాత దంపతులకు పట్టు వస్త్రాలు, నగలు చెక్కడం శిల్పి నైపుణ్యానికి, చిత్రభాషకు నిదర్శనమన్నారు. ఇది గిరిజన సంప్రదాయాన్ని దైవత్వంతో ముడిపెట్టే అపురూప దృశ్యమని శనివారం ఆయన పేర్కొన్నారు.
News January 25, 2026
కడప ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యకుమార్ శనివారం ప్రకటించారు. కడప జిల్లాలో మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ కేంద్రం ఏర్పాటుకు టెండర్లు నిర్వహించామన్నారు. డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో కిడ్నీ రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
News January 25, 2026
వైవీయూలో అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూ

వైవీయు క్యాంపస్ కళాశాల ఇంగ్లిశ్ విభాగంలో అతిథి అధ్యాపకుల నియామకం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 29న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆచార్య టి.శ్రీనివాస్ తెలిపారు. ఎం.ఎ. ఇంగ్లిష్ లిటరేచర్, నెట్/సెట్/పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. వివరాలకు www.yvu.edu.in ని సందర్శించాలని సూచించారు.


