News August 24, 2024

కడప జైలు వార్డెన్‌పై హత్యాయత్నం కేసు నమోదు

image

కాకినాడ జిల్లాకు చెందిన భువనేశ్వరి ఫిర్యాదుతో కడప జిల్లా జైలు వార్డెన్‌గా పనిచేస్తున్న మహేశ్‌పై తుళ్లూరు పోలీసులు శుక్రవారం హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మహేశ్‌తో భువనేశ్వరికి నాలుగు నెలల క్రితం వివాహం అయిందని సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. రాయపూడిలో అద్దెకు ఉంటున్న వీరి మధ్య గురువారం గొడవ జరిగిందని, వంట గ్యాస్ వదిలి ఆమె గాయపడేలా చేసి అతను కూడా విషం తాగాడన్నారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News January 18, 2025

Rewind: చౌటిపల్లెలో బస చేసిన సీనియర్ ఎన్టీఆర్

image

నందమూరి తారక రామారావు కొండాపురం మండలంలోని చౌటిపల్లెలో గతంలో బస చేశారు. 1982 ఏడాది చివరిలో తాడిపత్రి నుంచి చైతన్య రథంలో డ్రైవర్‌గా హరికృష్ణతో రామారావు రోడ్డు షో నిర్వహించారు. రోడ్డు షోలో భాగంగా చౌటిపల్లె వద్ద గల చిత్రావతి నదిపై వాహనం మొరాయించడంతో అక్కడే అగి బస చేశారు. 1993 ఎన్నికల ప్రచారంలో కూడా పాత కొండాపురంలో టీ తాగారు. నేడు NTR 29వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను పలువరురు Rewind చేసుకున్నారు.

News January 18, 2025

YSR జిల్లాపై చంద్రబాబు అసంతృప్తి

image

చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిలో చివరి మూడు స్థానాల్లో YSR జిల్లా, అల్లూరి, తూ.గో జిల్లా ఉండగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎంపీల పనీతీరు, జిల్లాలో పథకాల అమలు, తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురు మంత్రులను CM చంద్రబాబు హెచ్చరించారు.

News January 18, 2025

నేడు కడప జిల్లాకు చంద్రబాబు.. ట్రాఫిక్ ఆంక్షలు.!

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. CM పర్యటన నేపథ్యంలో జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మైదుకూరుకు వెళ్లే వాహనాల దారి పూర్తిగా మళ్లించారు. బద్వేలు- పోరుమామిళ్ల వైపు వెళ్లే వాహనాలు ఖాజీపేట, నాగసానిపల్లె మీదుగా వెళ్లాలన్నారు. కడప, ప్రొద్దుటూరు, కర్నులు వైపు వెళ్లే వాహనాలు టౌన్‌లోకి రాకుండా జాతీయ రహదారి పైనుంచి వెళ్లాలని CI సయ్యద్ తెలిపారు.