News June 22, 2024

కడప: టమాట యమ రేటు గురూ!

image

చిన్న, మధ్య తరగతి కుటుంబాలకు టమాట దడ పుట్టిస్తోంది. రోజు రోజుకు రేటు పెరుగుతూ పోతోంది. శుక్రవారం అత్యధికంగా కిలో టమాట రూ.88 పలికింది. వారం రోజుల కిందట రూ.60 ఉన్న టమాట ఇవాళ రూ.80 పైగా ఉండటంతో ప్రజలు ‘ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లొస్తాయి.. టమాట కొనాలంటేనే కన్నీళ్లొస్తున్నాయి’అని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Similar News

News October 5, 2024

కడప జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్లు బదిలీ

image

కడప జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 12 మంది డిప్యూటీ ఎమ్మార్వోలకు స్థానచలనం కల్పిస్తూ జేసీ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సంబంధిత స్థానాల్లో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేసినట్లు జేసీ పేర్కొన్నారు.

News October 5, 2024

మైదుకూరు: అవకతవకలపై 15 మందికి నోటీసులు

image

కడప జిల్లా మైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జారీ చేసి.. వారి సంజాయిషీలను సమర్పించాలని ఆదేశించినట్లు కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం తెలిపారు. ఫ్రీహోల్డ్ భూములపై వచ్చిన ఆరోపణల మేరకు.. రీ ఎంక్వయిరీ చేసి అక్కడ అవకతవకలు, తప్పులు జరిగినట్లు గుర్తించామన్నారు. దీంతో అక్కడ పనిచేసిన ఒక తహశీల్దార్‌తోపాటు 14 మంది వీఆర్వోలకు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు.

News October 4, 2024

వైఎస్‌ఆర్‌ జిల్లా పేరు మార్చాలన్న మంత్రి.. దీనిపై మీ కామెంట్

image

వైఎస్సార్ జిల్లా పేరును మార్చాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ CM చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. YCP ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వైఎస్‌ఆర్‌ కడప జిల్లాను వైఎస్‌ఆర్‌ జిల్లాగా మార్చిందని మంత్రి పేర్కొన్నారు. కడప జిల్లా చారిత్రక నేపథ్యం, వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని మంత్రి సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మీ కామెంట్..