News April 24, 2025
కడప: తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – కలెక్టర్

తాగునీటి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం ప్రొద్దుటూరు నియోజకవర్గ అబివృద్ధి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పశువులకు నీటి సరఫరా కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, జమ్మలమడుగు అర్డీఓ సాయిశ్రీ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 24, 2025
ప్రొద్దుటూరులో చదువుకున్న అమ్మాయికి స్టేట్ థర్డ్

టెన్త్ ఫలితాలలో జె.శ్రీవాణి సత్తా చాటింది. రైల్వే కోడూరు మంగంపేటలో నివాసం ఉంటున్న జె. శ్రీవాణి 598 మార్కులతో స్టేట్ 3వ ర్యాంక్, జిల్లా ఫస్ట్ ర్యాంకులు సాధించింది. ప్రొద్దుటూరు YMR కాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివి ఈ ఘనత సాధించింది. ఈమె తల్లిదండ్రులు జానకిరామారెడ్డి, లక్ష్మీదేవి, చిరు వ్యాపారస్తులుగా మంగంపేటలో జీవనం కొనసాగిస్తున్నారు.
News April 24, 2025
కడప: జిల్లా వ్యాప్తంగా కార్డాన్ అండ్ సర్చ్

ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పోలీసులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, అల్లర్లకు పాల్పడినా, అల్లర్లకు ప్రేరేపించినా చర్యలు తప్పవన్నారు. ఈ కార్డాన్ అండ్ సర్చ్‌లో రికార్డులు లేని 57 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
News April 23, 2025
సిద్దవటం హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

కడప జిల్లా సిద్దవటం మండలంలో 2022లో జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.1లక్ష జరిమానా విధిస్తూ కడప 7వ ఏడీజే కోర్ట్ జడ్జి జీఎస్ రమేష్ కుమార్ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. బుధవారం ఎస్సై మాట్లాడుతూ.. ఓ మహిళ మాచుపల్లి గ్రామ రేణుక ఎల్లమాంబ గుడి ముందు పడుకుని ఉండగా నరసింహులు అలియాస్ బూపడు పట్టుడు కట్టెతో బలంగా కొట్టి గాయపరిచి అత్యాచారం చేయడంతో ఆమె మృతి చెందిందన్నారు.