News December 29, 2024
కడప: ‘దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు’
పోలీసు ఉద్యోగాల నియామకం విషయంలో అభ్యర్థులు దళారుల, మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా, రిక్రూట్‌మెంట్ పారదర్శకంగా నిర్వహిస్తారని తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 1, 2025
రాజంపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒకరి మృతి
రాజంపేట రైల్వే స్టేషన్ సమీపంలో డెడ్‌బాడీ కలకలం రేపింది. 2వ ప్లాట్ ఫాం పక్కన ఉన్న మద్యం షాప్ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
News January 1, 2025
వేముల: ‘మా కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయి’
వేముల మండలం మబ్బుచింతలపల్లి గ్రామ సమీపంలోని తోటలో మంగళవారం తెల్లవారుజామున విశ్వజిత్ సాహు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే మృతుని తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకు ఉరి వేసుకుని చనిపోయే వ్యక్తి కాదని, మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు. మృతుడి తండ్రి విక్రమ్ కుమార్ ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
News January 1, 2025
రైతుల ఆలోచన విధానంలో మార్పు రావాలి: కడప కలెక్టర్
రైతుల ఆలోచన విధానంలో మార్పు వస్తే వ్యవసాయంలో అత్యధిక లాభాలు గడించవచ్చని కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. మంగళవారం కడప కలెక్టర్‌లోని తన ఛాంబర్‌లో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించాలని రైతులు ఉపయోగించే పనిముట్లు ఇతర వస్తువులను ఆధునికీకరించే దిశగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, రైతులకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.