News February 10, 2025

కడప: దస్తగిరికి నోటీసులు

image

మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై ప్రత్యేక పీపీ, దస్తగిరికి హైకోర్టు నోటీసులు పంపింది. ఈనెల 27కు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది..

Similar News

News February 25, 2026

27న వైవీయూలో జాబ్ మేళా: ప్రిన్సిపల్

image

కడప YVUలో ఈ నెల 27వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ. టి. శ్రీనివాస్ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, వైవీయు ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6300125455, 94405 16153 నంబర్లను సంప్రదించాలన్నారు.

News February 25, 2026

కడప జిల్లాలో పలువురు ఆర్డీవోల బదిలీ

image

కడప జిల్లాలో పనిచేస్తున్న పలువురు గ్రూప్-1 అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ అవిన్, జమ్మలమడుగు ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

News February 25, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,780
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,518
* వెండి 10 గ్రాముల ధర రూ.2,762.