News January 6, 2025

కడప: నకిలీ పెన్షన్లపై వేటుకు రంగం సిద్ధం

image

కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో లక్షలమంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్‌ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నేటినుంచి వాటి లెక్కను పెద్ద ఆసుపత్రుల డాక్టర్ల బృందం ఇళ్లకే వచ్చి మరీ లబ్ధిదారులను టెస్ట్ చేయనుంది.

Similar News

News January 7, 2025

తొండూరులో తల్లీ, కూతురు దారుణ హత్య

image

పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం తుమ్మలపల్లిలో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగాధరరెడ్డి మద్యం మత్తులో భార్య శ్రీలక్ష్మి (37), కుమార్తె గంగోత్రి (14)లను గొంతులు కోసి హతమార్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 7, 2025

కడప జిల్లా ప్రజలు భయపడకండి: డాక్టర్లు

image

కడప జిల్లాకు సమీపంలో ఉన్న బెంగళూరులో HMPV కేసు నమోదైంది. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు రానున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కడప రిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతుందని అన్నారు.

News January 7, 2025

కడప: కులగణన అభ్యంతరాలకు నేడే చివరి రోజు

image

కుల గణనకు సంబంధించి ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అభ్యంతరాల స్వీకరణ నేటితో ముగియనుంది. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి సరస్వతి తెలిపారు. కులగణన అభ్యంతరాలు ఇంకా ఉండిఉంటే, తగిన ఆధారాలతో సచివాలయాలకు వెళ్లాలన్నారు. కాగా దీనికి సంబంధించిన తుది జాబితాను జనవరి 17న సచివాలయాల్లో ప్రదర్శించనున్న విషయం తెలిసిందే.