News November 19, 2025

కడప: నడిరోడ్డుపై కొట్లాడుకున్న పోలీసులు

image

పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో మంగళవారం పోలీసుల మధ్య గొడవ జరిగింది. సీఎం చంద్రబాబు పర్యటన బుధవారం జరగనుంది. ఈ క్రమంలో బందోబస్తుగా మంగళవారం వచ్చిన ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ ఓ హోటల్ వద్ద మాట మాట పెరిగి గొడవకు దిగారు. మీరెంత అంటే మీరెంత అంటూ రెండు గ్రూపులుగా విడిపోయిన పోలీసులు నడిరోడ్డుపై కలబడ్డారు. స్థానికులు, తోటి పోలీసులు వారికి సర్ది చెప్పారు. ఈ ఘటనపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.

Similar News

News November 21, 2025

చిత్తూరు: పేదరికాన్ని జయించినా.. విధిని ఓడించలేక.!

image

అసలే పేదరికం.. మరోవైపు తల్లిలేని లోటు. అయినా ఆమె పట్టుదలతో ఉన్నత చదువులు చదివింది. ఓ వైపు నాన్నకు తోడుగా ఉంటూ, కుటుంబ బాధ్యతలు మోస్తూ <<18347620>>కష్టాల కడలి<<>>ని దాటి MLHP ఉద్యోగం సంపాదించింది ఆదిలక్ష్మి. పెళ్లి చేసుకుని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ విధికి ఇది నచ్చలేదోమో. ఆమె బిడ్డ రూపంలో మరోసారి పరీక్షించింది. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్న ఆమె కూతురి విషయంలో కలత చెంది ఆత్మహత్య చేసుకుంది.

News November 21, 2025

ప్రొద్దుటూరులో బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్.!

image

పొద్దుటూరు పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.10.56 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలక వ్యక్తులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి చెందిన ఆర్ల చంద్ర యాదవ్‌ను శుక్రవారం డీఎస్పీ భావన ఆధ్వర్యంలో సీఐ సదాశివయ్య అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.

News November 21, 2025

ఆటో ప్రయాణికుల భద్రతకు ‘అభయ్’ యాప్: ఎస్పీ

image

ఆటో ప్రయాణికుల భద్రతను బలపరిచేందుకు ‘అభయ్’ యాప్ ని ప్రారంభించినట్లు మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. జిల్లాలోని 1,281 ఆటోలకు ‘మై టాక్సీ సేఫ్’ అనే అభయ్ యాప్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్ అమర్చామన్నారు. అలాగే, ఆటో డ్రైవర్లను సంస్థతో అనుసంధానం చేసి, రూ.350 ప్రీమియంతో ప్రమాదంలో మరణానికి రూ. లక్ష బీమా అందే విధంగా ఏర్పాటు చేశారు.