News April 22, 2025
కడప: నాగాలాండ్‌కు బదిలీ అయిన యువజన అధికారి

ఉమ్మడి కడప జిల్లా నెహ్రూ యువ కేంద్ర యువజన అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణికంఠ కడప నుంచి నాగాలాండ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. జిల్లాలో ఐదు సంవత్సరాల పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. బదిలీపై వెళుతున్న మణికంఠను స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, వాలంటీర్లు ఘనంగా సన్మానించారు.
Similar News
News April 22, 2025
కడప జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కడప జిల్లాలో 27,800 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 22, 2025
కడప: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్..!

కడప జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?
News April 22, 2025
కడప: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు శాంతినగర్ బ్రిడ్జి వద్ద బైకు అదుపుతప్పి డివైడర్ ఢీకొనడంతో చియ్యవరం పంచాయతీ నడింపల్లికు చెందిన చరణ్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నవీన్ బాబు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.