News April 24, 2025

కడప: నోటిఫికేషన్ విడుదల

image

ఏపీలో టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని ఒంగోలు, ఇడుపులపాయ ఐఐఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 19, 2025

పాలమూరు: ఈనెల 21న.. U-19 కరాటే ఎంపికలు

image

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు కరాటే ఎంపికలను ఈనెల 21న మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT

News December 19, 2025

అలాంటి ఒప్పందమే లేదు.. ఐదేళ్లు నేనే సీఎం: సిద్దరామయ్య

image

పవర్ షేరింగ్‌పై ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని కర్ణాటక CM సిద్దరామయ్య అన్నారు. ఐదేళ్లు తానే CMగా కొనసాగుతానని అసెంబ్లీలో చెప్పారు. ‘నేను ఇప్పుడు సీఎంను. హైకమాండ్ డిసైడ్ చేసే వరకు కొనసాగుతా. అధిష్ఠానం నాకే ఫేవర్‌గా ఉంది. 2.5 ఏళ్ల ఒప్పందమేదీ జరగలేదు’ అని తెలిపారు. CM పదవిపై DK శివకుమార్, సిద్దరామయ్య మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ <<18446337>>బ్రేక్‌ఫాస్ట్<<>> మీటింగ్స్ నిర్వహించారు.

News December 19, 2025

భారీ జీతంతో AVNL ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) 6 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BE, B.Tech, PG, PhD, డిప్లొమా, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉంటే JAN 6వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కన్సల్టెంట్, Sr. కన్సల్టెంట్‌కు నెలకు రూ.1,20,000+IDA, Sr. మేనేజర్‌కు రూ.70000+IDA, Jr. మేనేజర్‌కు రూ.30,000+IDA చెల్లిస్తారు. వెబ్‌సైట్: avnl.co.in/