News December 19, 2025
కడప: ప్రజలకు APS RTC గుడ్ న్యూస్..!

YSR కడప జిల్లాలోని ప్రజలకు APS RTC శుభవార్త తెలిపింది. APS RTC కార్గో విభాగం డిసెంబర్ 20 నుంచి 2026 జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 84 ముఖ్య పట్టణాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో, 50 కేజీల వరకు సరుకులను నేరుగా ఇంటి వద్దకే చేరవేసే ఈ సేవ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 30, 2025
2025: కడప జిల్లాలో పెరిగిన మృతుల సంఖ్య

కడప జిల్లాలో 2025 సంవత్సరంలో 699 ఘోర, సాధారణ రోడ్డు ప్రమాద కేసులు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ ప్రమాదాలలో 351 మంది మృతి. 781 మంది గాయపడ్డారు. 2024లో 633 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా.. 316 మంది మృతిచెందారు. 716 మంది గాయపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ఈ ఏడాది రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయని ఎస్పీ పేర్కొన్నారు.
News December 30, 2025
పుష్పగిరిలో అపశ్రుతి.. వైకుంఠ ద్వార దర్శనం రద్దు

కడప జిల్లాలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని మంగళవారం తాత్కాలికంగా నిలిపివేశారు. పుష్పగిరి గ్రామ పరిధిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో సంప్రదాయ నియమాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తిచేసి పూజా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారని తెలుస్తోంది.
News December 29, 2025
కడప: న్యూ ఇయర్ వేళ బేకరీలపై నిఘా

నూతన సంవత్సరం సందర్భంగా కడప నగరంలోని పలు బేకరీలు, కేక్ తయారీ కేంద్రాలపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కమిషనర్ మనోజ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం హెల్త్ ఆఫీసర్ డా.రమేశ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిణి కేక్ తయారీ విధానాన్ని పరిశీలించారు. తయారీ కేంద్రాల్లో శుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.


