News March 21, 2024
కడప: ప్రశాంత ఎన్నికల కోసం అందరి సహకారం

ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అందరి సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లో ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం జేసీ గణేశ్ కుమార్, కడప కమిషనర్ ప్రవీణ్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటా ప్రచారం చేయాలన్నా కూడా అనుమతులు తప్పనిసరన్నారు. సభలు సమావేశాల నిర్వహణకు 48 గంటల ముందే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.
Similar News
News July 9, 2025
ముద్దనూరులో యాక్సిడెంట్

ముద్దనూరులోని కొత్తపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగింది. రాజంపేట నుంచి తాడిపత్రి వైపు వెళుతున్న బొలేరో క్యాంపర్ మినీ లారీ ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. దీంతో బొలేరోలో ఉన్న రజాక్, గోవిందమ్మ, శివమ్మ, మరొకరికి గాయాలయ్యాయి. వారిని ముద్దనూరు 108 వాహన సిబ్బంది సుబ్రహ్మణ్యం ప్రొద్దుటూరు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
News July 9, 2025
Y.S జగన్‌కు మరో పదవి

సింహాద్రిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌరవ ఛైర్మన్‌గా పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డిని నియమించారు. ఛైర్మన్‌గా బండి రామసూరరెడ్డి, వైస్ ఛైర్మన్‌గా వి.ఓబులేసును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ప్రకటన విడుదల చేశారు.
News July 9, 2025
కడప అభివృద్ధిపై జిల్లాస్థాయి సమావేశం

కడప కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై చర్చించారు. కడప మరింత వేగంగా అభివృద్ధి చెందేలా కార్యాచరణను సమీక్షించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పుత్తా చైతన్య రెడ్డి తదితరులు ఉన్నారు.