News March 22, 2024
కడప: ప్రశాంత ఎన్నికల కోసం పటిష్టమైన నియంత్రణ.!

సాధారణ ఎన్నికలు -24 కోసం కడప కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ లో ఎన్నికలకు సంబందించిన కార్యకలాపాల పర్యవేక్షణ పకడ్బందీగా జరుగుతోందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. జిల్లా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక పర్యవేక్షణ అధికారి కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్ సారథ్యంలో ఎంసీఎంసీ మానిటరింగ్, పర్మిషన్ & ఎన్ఫోర్స్మెంట్ తదితర అంశాలకు సంబంధించిన డెస్కులను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News September 4, 2025
సెలవులో వెళ్లనున్న కడప కలెక్టర్

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వ్యక్తిగత పని నిమిత్తం సెలవుపై వెళ్లనున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు యూకేకి వెళ్తున్నారు. ప్రస్తుత జేసీ అదితి సింగ్ కలెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
News September 4, 2025
9న కడపలో గండికోట ముంపు వాసుల సమీక్ష.!

గండికోట ముంపు వాసుల సమీక్ష సమావేశం ఈనెల 9న కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. సమావేశంలో కొండాపురం మండలంలోని ఓవన్నపేట, చౌటపల్లి, బొమ్మపల్లి మరో 11 గ్రామాల గృహాల పునరావాస పరిహారంపై చర్చించనున్నారు. జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి, అధికారులు పాల్గొంటారు. వీరితోపాటు కొంతమంది ముంపు బాధితులు వెళ్లనున్నారు.
News September 3, 2025
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా కడప జిల్లా నుంచి ముగ్గురు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు అర్హులుగా నిలిచారు. పెండ్లిమర్రి మండలం ఎగువపల్లె హైస్కూల్‌కు చెందిన హిందీ టీచర్ ఖాదీర్, కాశినాయన మండలం రెడ్డికొటాల MPUPS, SGT బి.పరిమళ జ్యోతి, ప్రొద్దుటూరు పరిధిలోని లింగారెడ్డిపల్లె MPPS, SGT షేక్ జవహర్ మునీర్‌లు అవార్డుకు ఎంపికయ్యారు.