News April 15, 2025
కడప: బిల్టప్ సర్కిల్‌లో దారుణ హత్య

కడప నగరంలోని బిల్టప్ సర్కిల్‌లో ఇవాళ దారుణ హత్య జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సాదిక్ అనే రవీంద్రనగర్‌కు చెందిన యువకుడు తన వ్యక్తిగత పని నిమిత్తం బయటకు వచ్చినప్పుడు కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయన మీద మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 15, 2025
ఉమ్మడి కడప జిల్లాలో 106 పోస్టులు

ఉమ్మడి కడప జిల్లాలో 106 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 57 SGT(ప్రాథమిక స్థాయి), 49 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
News April 15, 2025
ఒంటిమిట్ట: పుష్పయాగానికి సిద్ధం చేస్తున్న అధికారులు

ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ అధికారులు కావలసిన వివిధ రకాల పుష్పాలను ఆలయానికి సమకూర్చారు. పుష్పయాగానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
News April 15, 2025
కడప: రూ.1.8 కోట్ల విలువచేసే 602 ఫోన్ల రికవరీ

కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి భారీగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేశారు. కడపలోని ఎస్పీ ఆఫీస్ ప్రాంగణంలోని పెన్నేరు హాల్‌లో ఎస్పీ అశోక్ కుమార్ మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సుమారు రూ.1.8 కోట్ల విలువచేసే 602 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు.