News December 1, 2024

కడప: భర్త సమాధి వద్దకు వెళ్తూ భార్య మృతి

image

భర్త చనిపోయిన మూడు రోజులకే భార్య చనిపోయిన విషాద ఘటన ఇది. కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లెకు చెందిన సాకే నాగరాజు నవంబర్ 26న చనిపోయారు. ఈక్రమంలో ఆయన భార్య నాగసుధ(36) భర్త సమాధి చూడటానికి బైకుపై బయల్దేరారు. మార్గమధ్యలో స్పీడ్ బ్రేకర్ వద్ద కిందపడి గాయపడ్డారు. కడపలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు.

Similar News

News January 22, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు కడప జిల్లా కబడ్డీ జట్లు ఎంపిక

image

51వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే కడప జిల్లా సీనియర్ విభాగం బాలబాలికల జట్లను బుధవారం ఎంపిక చేశారు. కడప నగరంలోని శివ శివాని హైస్కూల్ మైదానంలో నిర్వహించిన ఈ ఎంపికలను జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, జనార్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు వైజాగ్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు.

News January 22, 2025

కడప: ‘నేరస్థులకు శిక్ష.. బాధితులకు న్యాయం’

image

నేరం చేసిన వారికి శిక్ష, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో కడప, అన్నమయ్య జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానంతో, నిబద్ధతతో నేరాల కట్టడికి కృషి చేయాలన్నారు.

News January 22, 2025

కడప నగరం వరకే సెలవు

image

కడపలో ఇవాళ అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీరాముడి కళ్యాణం, శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈవెంట్ నిర్వాహకులు, పాఠశాలల టీచర్ల విజ్ఞప్తి మేరకు అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు నేడు(బుధవారం) సెలవు ప్రకటించారు. ఈ సెలవు కేవలం కడప నగరం వరకే వర్తిస్తుంది. జిల్లాలోని ఇతర విద్యా సంస్థలు పనిచేస్తాయి. తామూ శోభాయాత్రకు వెళ్తామని.. తమకూ సెలవు కావాలని కడప పరిసర మండల వాసులు కోరుతున్నారు.