News January 12, 2025
కడప: భోగి మంట వేస్తున్నారా?

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
Similar News
News December 22, 2025
అత్యున్నత ప్రమాణాలతో ట్రైనీ కానిస్టేబుళ్లకు శిక్షణ: SP

కడప జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 194 మంది సివిల్, 330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. అత్యున్నత ప్రమాణాలతో కూడిన వసతులు, ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణ, నిజాయతీతోపాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి, సైబర్ నేరాల దర్యాప్తుపై పట్టు సాధించాలని సూచించారు.
News December 22, 2025
అక్షర బాటలో బాలయపల్లె ప్రాథమిక పాఠశాల ఆయమ్మ

కాశినాయన మండలం బాలాయపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయాగా యంబడి బాల నాగమ్మ చాలా కాలంగా పనిచేస్తోంది. చదువంటే ఆమెకు మక్కువ కానీ పరిస్థితులు అనుకూలించక నిరక్షరాస్యురాలిగానే ఉంది. పాఠశాలలో విద్యార్థులను గమనించిన ఆమె తనకు కూడా అక్షరాలు నేర్చుకోవాలని ఉందని ఉపాధ్యాయుడు ఖాసీం వల్లికి తెలిపింది. స్పందించిన ఉపాధ్యాయుడు ఆయమ్మకి ‘రోజుకో అక్షరం’ నేర్పుతున్నారు. ఆయమ్మ సంతోషం వ్యక్తం చేసింది.
News December 22, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.13540
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12457
☛ వెండి 10 గ్రాముల ధర: రూ.2080.


