News November 25, 2024

కడప: మరదలితో అసభ్యంగా ప్రవర్తించినందుకే హత్య.!

image

మైదుకూరు మండలంలో నిన్న హత్య జరిగిన విషయం తెలిసిందే. చెర్లోపల్లికి చెందిన వీర నారాయణ యాదవ్‌కు బాలకృష్ణ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల బాలకృష్ణ కువైట్ వెళ్లారు. డబ్బు కోసం వీర నారాయణ తరచూ బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. సమస్య ఏంటో చూడాలని బాలకృష్ణ తన అన్న సుబ్బరాజుకు చెప్పగా.. ఆయన కోపంతో వెళ్లి నారాయణను గొడ్డలితో నరికి హత్య చేశాడు.

Similar News

News December 20, 2025

కడప జిల్లా యువతకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు

image

గుంటూరులోని KL యూనివర్సిటీలో ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో YSR కడప జిల్లా విద్యార్థిననులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో పొయెట్రీ విభాగంలో హీనఫిర్హత్ ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. స్టోరీ విభాగంలో వెంకట సాహిత్య ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీరిద్దరూ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకున్నారు.

News December 20, 2025

ఖాకీ చొక్కా ధరించిన కడప బిడ్డలు..!

image

కడప జిల్లా వ్యాప్తంగా 110 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. కడప నియోజకవర్గానికి చెందిన 13 మంది యువత కానిస్టేబుల్‌లుగా ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే మాధవి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కష్టపడి చదివి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించిన యువత జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు.

News December 20, 2025

అన్నమయ్య: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నం

image

అభం, శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితులు పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. మండలానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికకు తల్లిదండ్రులు లేరు. అవ్వ చెంతనే ఉంటోంది. అవ్వ కూలి పనులు చేసుకుంటూ పాపను పోషించుకుంటూ చదివిస్తోంది. బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తరువాత యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.