News April 12, 2025

కడప: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్

image

కడప జిల్లాలో ఇటీవల జరిగిన ఇంటర్ ఫలితాలు ఇవాళ 11 గంటలకు రానున్నాయి. కడప జిల్లాలో మొత్తం 64 పరీక్షా కేంద్రాల్లో 32,885 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 17,114 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 15,771 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News April 12, 2025

కడప జిల్లా నేతలకు చంద్రబాబు సూచనలు

image

కడప విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణ ఆకృతుల గోడపత్రాలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణంలో నాణ్యత లోపం కనిపించకూడదన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉభయ కడప జిల్లా నేతలందరూ కలిసి భూమి పూజ చేయాలని స్పష్టం చేశారు.

News April 12, 2025

కడప జిల్లాకు 21వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో కడప జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 15301 మంది పరీక్షలు రాయగా.. 9295 మంది పాసయ్యారు. 61 శాతం పాస్ పర్సంటేజీతో కడప జిల్లా రాష్ట్రంలోనే 21వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 12878 మందికి, 9688 మంది పాసయ్యారు. 75 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 22వ స్థానంలో కడప జిల్లా నిలిచింది.

News April 12, 2025

బద్వేల్: వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆదిత్య రెడ్డి

image

వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కుమారుడు దేవసాని ఆదిత్య రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తనపై నమ్మకంతో కీలకమైన స్థానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు.

error: Content is protected !!