News January 24, 2025
కడప: మహిళా ఉద్యోగిపై వేధింపులు.. చర్యలు తప్పవు

కడప రవాణా శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై డీటీసీ చంద్రశేఖర్ వేధింపుల పట్ల అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులు, జాయింట్ రవాణా కమిషనర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో శుక్రవారం కడప రవాణా శాఖ కార్యాలయంలో స్వయంగా బాధిత మహిళా ఉద్యోగితో మాట్లాడారు. అనంతరం ఘటనపై ప్రత్యేకంగా విచారించారు. కార్యాలయంలోని సీసీ కెమెరాలు స్వయంగా పరిశీలించి డీటీసీ చంద్రశేఖర్‌పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News March 2, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 96% విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో సోమవారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ మ్యాథమాటిక్స్ పేపర్-1 పరీక్షలకు 96% విద్యార్థులు హాజరయ్యారు. 10,926 మందికి గాను.. 10,463 మంది పరీక్షలు రాయగా, 463 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 9,588 మందికి గాను.. 9,284 మంది హాజరవ్వగా, 304 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,338 మందికి గాను.. 1,179 మంది పరీక్షలు రాశారు. 159 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు.
News March 2, 2026
ప్రొద్దుటూరులో భారీగా పెరిగిన బంగారు, వెండి ధరలు.!

బంగారం వ్యాపారంలో రెండో ముంబయిగా పేరుపొందిన ప్రొద్దుటూరులో సోమవారం బంగారు, వెండి ధరలు భారీగా పెరిగాయి.
ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేటి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.17,000
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,640
*వెండి 10 గ్రాముల ధర రూ.2,992గా ఉంది.
News March 2, 2026
కడప జిల్లాలో రేపు బడులకు సెలవులు

హోలీ పండుగ సెలవు దినం రేపే అని కడప జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శంషుద్దీన్ స్పష్టం చేశారు. అకడమిక్ క్యాలండర్‌లో తెలిపినట్లుగా హోలీ పండుగ సెలవు దినం నాలుగో తేదీ కాదని మార్చి మూడున నిర్ణయించామన్నారు. విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు గమనించాలని కోరారు.


