News December 20, 2024
కడప: ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
Similar News
News January 23, 2025
కడప సెంట్రల్ జైలు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
కడప శివార్లలోని సెంట్రల్ జైలు సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరినీ రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ వైద్యులు పరీక్షించి అప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందారని నిర్ధారించారు. రామాంజనేయపురం పరిధిలోని శ్రీరామనగర్‌కు చెందిన పడిగ ప్రవీణ్, వి. సుభాశ్‌లుగా గుర్తించారు.
News January 23, 2025
కడప: నేడు జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్ ఎంపికలు
కడప జయనగర్ కాలనీ జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో గురువారం సాయంత్రం 4 గంటలకు జిల్లాస్థాయి బాస్కెట్ బాల్ బాలబాలికల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవరెడ్డి తెలిపారు. 01-01-2002వ తేదీకి ముందు పుట్టిన క్రీడాకారులు ఎంపికలకు అర్హులన్నారు. జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు విజయవాడలో ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు.
News January 22, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు కడప జిల్లా కబడ్డీ జట్లు ఎంపిక
51వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే కడప జిల్లా సీనియర్ విభాగం బాలబాలికల జట్లను బుధవారం ఎంపిక చేశారు. కడప నగరంలోని శివ శివాని హైస్కూల్ మైదానంలో నిర్వహించిన ఈ ఎంపికలను జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, జనార్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు వైజాగ్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు.